Thursday, January 30, 2020

ఈ విరహానికి అర్ధం ఉంది!!

అలసి ఇంటికి వచ్చి కలిసి వండుకున్నాం ...
పెద్దవాళ్ళం అనుకున్నా, కాదు, కలిసి పెరిగాం .. 
గమ్యం లేని ప్రయాణాలు, కలిసి పాడుకున్నాం ... 
భవిష్యత్తు మీద ఆశ , కలిసి చదువుకున్నాం.. 
సమాజం చేసిన ఎగతాళికి కలిసి నవ్వుకున్నాం ... 
లోకం వేసిన అడ్డుగోడల్ని కలిసి దాటాం... 
సొంత వాళ్ళు పెట్టిన ఆంక్షలకు కలిసి పోరాడాం ... 
నిస్సహాయపు రోజుల్లో కలిసి ఏడ్చామ్.. 
విహార యాత్ర లో కలిసి ఈదాం ... 

అర్ధనారీశ్వరులు అని ఎందరో కొనియాడినా ... 
భారతీయుడు couple అని ముద్దుగా పిలిచినా  ... 

ఈ విరహాన్ని మాత్రం తప్పించుకోలేకపోయాం.. 

నీ భుజం పై తల పెట్టుకుని పడుకునే రోజు 
నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే రోజు.. 
నీ చేతిలో  చేయి వేసి మాట్లాడే రోజు .. 
రేపేనేమో అని ఆశతో ఎదురుచూస్తున్నా ... 

ఇది దేవుడు ఆడుతున్న ఆటలో భాగమా??
లేదా కర్మానుసారం చేసుకున్నదా ??
లేదా విధి ఎప్పుడో నిర్ణయించిన మార్గమా??

ఏదేమైనా .. ఈ విరహాన్ని అర్ధం ఉంది.. విలువ ఉంది. .. 


Wednesday, January 29, 2020

ఎవరు గొప్ప?

జీవితం చూపించిన కష్టాలను దాటిన నువ్వు గొప్ప, కానీ ఆ కష్టాలలో నీ వెన్నంటి ఉన్న ఆమె??

కన్నీరు అనే సాగరాన్ని ఈదిన నువ్వు గొప్ప, కానీ ఆ కన్నీటిని తుడిచిన ఆమె??

ఒంటిరిగా బాధల్ని ఎదుర్కున్న నువ్వు గొప్ప, కానీ ఒంటరి తనంలో నీడలా నిల్చున్న ఆమె??

లోకమంతా చిన్న చూపు చూసినా, ఎత్తుకెదిగిన నువ్వు గొప్ప, కానీ నువ్వే నా రారాజు అన్న ఆమె??

గొప్పే కదా... 

Tuesday, January 28, 2020

I take a bow

To all the ordinarily looking extra ordinary people.

They have doubts, but never back off to take risks.
They ask questions, but not shy away from chasing answers.
They take very small steps, but never miss to reach their dream.
They do seemingly insignificant work, but don't forget to be happy about the journey.
They exhibit humility, but there is a volcano bursting inside.

To all the greatness in each of you..
To all the steadiness in each of you...
To all the hardships and all the soreness...

I take a bow. 

Tuesday, January 21, 2020

నవ్వే ఆయుధం.. నవ్వే సమాధానం.

మిత్రులతో హాస్యమాడినప్పుడు ముచ్చటైన గట్టి నవ్వు
ప్రియురాలిని చూసినప్పుడు మధురమైన నవ్వు
దేవుడి ధ్యానం లో ప్రశాంతమైన నవ్వు
కవ్వించేటప్పుడు కొంటె నవ్వు

జీవింతం విసిరిన కష్టమైన ప్రశ్నలకు గంభీరమైన నవ్వు
విసుగెత్తిన వాదనలో నిట్టూర్పు నవ్వు
గెలవలేని పోటీలు ఎదురైనప్పుడు నిస్సహాయపు నవ్వు

నవ్వునే ఆభరణంగా ధరించిన శివుడివా?
లేదా నవ్వునే జపంగా ఎంచుకున్న ఋషివా?

నవ్వే నీ ఆయుధమా? నవ్వే నీ సమాధానమా ??


Monday, January 20, 2020

nanotale - Life is short, boss!

She: Why do you keep messaging people who ignore you?

Me: Life is too short to find new people and have ego to lose the old ones. 

Sunday, January 19, 2020

నిలువెత్తు రూపం

అమాయకంగా కనిపించే నీ కళ్ళు, భవిష్యత్తు పై నీకున్న ఆశకి సంకేతం. 

ఆత్మావిశ్వాసంతో కూడిన నీ చిరునవ్వు, నీ పట్టుదల పై నీకున్న నమ్మకానికి సంతకం . 

నిటారుగా ఉన్న నీ వెన్నుముక, వెయ్యి ఏనుగులను సాధిచగలననే ధైర్యానికి నిదర్శనం. 

చేతులు కట్టుకుని నిలబడ్డ నువ్వు, స్ఫూర్తి దాయక జీవితానికి ఒక నిలువెత్తు రూపం . 

Thursday, January 16, 2020

నేనెంత

నీవు పడిన కష్టాల ముందు నేనెంత,
నీవు ఎదుర్కున్న ఒడిదుడుకుల ముందు నేనెంత,
చెరువు లో వాన పామంత...

నువ్వు ఈదిన సాగరాల ముందు నేనెంత,
నువ్వు మోసిన బరువు ముందు నేనెంత,
సముద్రం పై ఎగిరే పిచుకంత...

నీ నిద్ర లేని రాత్రుల ముందు నేనెంత,
నీ అలసి సొలసిన పగళ్ళ ముందు నేనెంత,
సూర్యుడి కింద వెలిగే మిణుగురు పురుగంత...

కన్నీళ్ళతో గొంతు తడుపుకున్న నీ శ్రమ ముందు నేనెంత,
చిరునవ్వుతో కడుపు నింపుకున్న నీ ఆకలి ముందు నేనెంత,
బియ్యంలో ఆవ గింజంత...

గుండె నిండా ఉన్న నీ ధైర్యం ముందు నేనెంత,
మనసు నిండా ఉన్న నీ ప్రేమ ముందు నేనెంత,
గాలి వానలో ఎగిరిపోయే జాజి పూవంత...

సమాజంతో పోరాడిన నీ పట్టుదల ముందు నేనెంత,
శిఖరాలను చేర్చగలిగే నీ జ్ఞానం ముందు నేనెంత,
కొండ అంచుల్లో పెరిగే గడ్డి పోచంత...

నీ వయసుకి మించిన అనుభవాల ముందు నేనెంత,
ప్రేరేపితమైన నీ జీవితం ముందు నేనెంత,
హనుమంతుడి ముందు కుప్పి గెంతంత...


Friday, January 10, 2020

Sneham

వ్యవహారిక బంధాలు, తామరాకుపై నీటి బిందువులు . 
కుటుంబ సంబంధాలు, జాజి పందిరి. 
తోబుట్టువులతో అయితే గులాబీ, దానితో పాటు వచ్చే ముళ్ళు. 
ప్రేమికుడి బంధం, జాజి వెదచల్లే సువాసన... 

మన జీవితం లో ఒక్కో దశ లో ఒక్కో రకమైన అనుభూతిని పొందుతూ ఉంటాం.

అందులో ఒకటి స్నేహం. ఒక స్నేహితుడితో బంధం చల్లగా  వీచే గాలి. 

పలకా బలపం వయసులో చాకోలెట్లు పంచుకోవడం స్నేహం అయితే, పరుగు పందెం లో ఓడి నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించడమూ స్నేహమే.. 

తప్పు దోవ పడుతుంటే ఆపేవాడు, తప్పటడులు వేయకుండా చూసేవాడు, నిత్యం వెన్నంటి కాపు కాసేవాడు ...  కలిసి మెలిసి ఆశయ సాధనకై, పట్టు వదలని సైనికులిలా నడిచేవారు... 

అలాంటి స్నేహితులు ఎదురు పడినప్పుడు, మనసు వారిలో కలవాలని, వారితో చేరాలని కుతూహల పడినా, 

పగలంతా అల్లరి చేసి ప్రశాంతం గా పడుకున్న పసి బాబు ను చూసి పులకిరించే తల్లి లా, 

వారిని అలానే దూరమునుండి చూడడమూ స్నేహమే.. 

Nano tale - Best Friend

He said: "I see you talking to yourself."

She said: "Yeah!, because I don't have a best friend to talk to."

He said: "No!! May be you are your best friend!! " 

She nods, with a smile, silently. 

Withdrawal

The phase of life, when you actively, consciously withdraw yourself from love and hate.  The moments when nothing seems to reach your heart....