Thursday, January 16, 2020

నేనెంత

నీవు పడిన కష్టాల ముందు నేనెంత,
నీవు ఎదుర్కున్న ఒడిదుడుకుల ముందు నేనెంత,
చెరువు లో వాన పామంత...

నువ్వు ఈదిన సాగరాల ముందు నేనెంత,
నువ్వు మోసిన బరువు ముందు నేనెంత,
సముద్రం పై ఎగిరే పిచుకంత...

నీ నిద్ర లేని రాత్రుల ముందు నేనెంత,
నీ అలసి సొలసిన పగళ్ళ ముందు నేనెంత,
సూర్యుడి కింద వెలిగే మిణుగురు పురుగంత...

కన్నీళ్ళతో గొంతు తడుపుకున్న నీ శ్రమ ముందు నేనెంత,
చిరునవ్వుతో కడుపు నింపుకున్న నీ ఆకలి ముందు నేనెంత,
బియ్యంలో ఆవ గింజంత...

గుండె నిండా ఉన్న నీ ధైర్యం ముందు నేనెంత,
మనసు నిండా ఉన్న నీ ప్రేమ ముందు నేనెంత,
గాలి వానలో ఎగిరిపోయే జాజి పూవంత...

సమాజంతో పోరాడిన నీ పట్టుదల ముందు నేనెంత,
శిఖరాలను చేర్చగలిగే నీ జ్ఞానం ముందు నేనెంత,
కొండ అంచుల్లో పెరిగే గడ్డి పోచంత...

నీ వయసుకి మించిన అనుభవాల ముందు నేనెంత,
ప్రేరేపితమైన నీ జీవితం ముందు నేనెంత,
హనుమంతుడి ముందు కుప్పి గెంతంత...


No comments:

Post a Comment

karu mabbulu

ఊరు మొత్తం కారు మబ్బులు కప్పేసాయి, నా మనసును మీ ఆలోచనలు కప్పేసినట్టు..........