సమయం అర్ధ రాత్రి కావొస్తోంది..
నిద్ర పట్టక అలా చల్ల గాలికి బయటకి వచ్చాను..
వీధి దీపం తప్ప ఏమీ లేక చీకటి..
ఎదురింటి ఒక గది లో వెలుతురు ఉంది..
అక్కడ కిటికీ నుండి కనిపిస్తూ ఒక పక్షి ఆకారం...
అది ఆ గది లో ఉన్న బొమ్మా లేక బయట ఉన్న నిజం పక్షా అని అర్థం కాలేదు...
కానీ కుతూహలంతో అలానే చూస్తూ ఉండగా అది కదల సాగింది... అప్పుడు నిజమైన పావురమే అని అర్థం అయ్యింది.. ఇంకా చూడగా..........
దాని కదలికలు........
చాలా క్షోభ పడుత ఉన్నట్టు ఉన్నాయి...
వంటరిగా దారి తప్పి, చీకటి పడక ముందే ఇంటికి చేరలేక, ఎటు పోవాలో తెలికా అక్కడ ఇరుక్కు పోయింది...
ఎవరైనా వచ్చి నా కోసం వేతుకుంటారేమో,
దారి చుపిస్తరేమో,
ధైర్యం చెప్తారేమో,
నా బాధను అర్థం చేసుకుని,
నా కన్నీళ్లను తుడిచి,
ఓడారుస్తారేమో
అని అది ఎదురుచూస్తున్నట్లు అనిపించింది...
కానీ అవేవీ జరగవ్..
బిక్కు బిక్కు మంటూ...
ఈ రాత్రి ఎలాగైనా గడపల్సిందే,
సూర్యోదయం కోసం వేచి చూడాల్సిందే...
కొత్త రోజు కోసం ఆగాల్సిందే...
మనకి మనమే ధైర్యం చెప్పుకోవల్సిందే...
మన గుండెను నిబ్బరం చేసుకోవల్సిందే...
No comments:
Post a Comment