వేగంగా వస్తున్న కారు మబ్బులు
కమ్ముతున్న చీకట్లు హోరున కురిసే జల్లులు
నిశీధిని చీల్చుకుని వచ్చే సూర్య కిరణాలు..
అవే కారు మబ్బులు మనసుని చుట్టుముడితే??
ఆలోచనా శక్తి క్షీణించి, మంచి చెడుల మధ్య విచక్షణ కోల్పోతే?
తప్పొప్పులో ఉన్న వ్యత్యాసం అర్ధం కాక, అన్ని తప్పుల వలె తోచితే?
ప్రకృతి మనకి ఎంతో నేర్పిస్తుంది
రాత్రి తరువాత పగలు ఉంటుందని,
కమ్మిన చీకటి వీడక తప్పదని
భూతల్లాన్ని వికసింపజేయసేది వర్షం అని
చీకటి వెలుగులు సహజమని.
నేను రోజు చూసే ముఖాలు
నాకు రోజు వినపడే మాటలు
ఆనందంతో నిండిన గదులు
అందరి చిరు మందహాసాలు,
ఈ రోజు వేరే గా కనిపిస్తున్నాయి.. అన్నిటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగడమే జీవితం ...
No comments:
Post a Comment