Friday, February 28, 2020

అందని ద్రాక్ష పుల్లన

అందని ద్రాక్ష పుల్లనంటారు కానీ ఆ నక్క తాపత్రయం, కోరిక, ఆశకి సమాధానం ఇవ్వలేదు ..

ఒక కష్టమైన బాటను ఎంచుకుని,
అవాంతరాలను ఎదురుకుని

ఏదో సాధించాలని పయనం మొదలెట్టి

సమాజం  నిర్దేశించిన స్థాయికి చేరలేక
పెట్టిన అచ్చులో ఇమడలేక
ఇచ్చిన కొలతను అందుకోక
పక్కవారితో తూగలేక
ఓటమిని ఒప్పుకోక

ఈ ప్రయాణమే ఒక గమ్యం అని
నా అనుభవమే నా ఆస్తి అని

ఏడ్చే ధైర్యం లేక
ఇంకా పోరాడే సహనం లేక
ఆట ఆపే మనసు రాక

ఆఖరికి గుంపుతో కలిసిపోయి

అందని ద్రాక్ష పుల్లనలే అని సద్దుకుపోయింది ఆ నక్క ...




Tuesday, February 25, 2020

ఉంటా నీతో

తొమ్మిది నెలలు నిన్ను మోయలేదు..
నిన్ను చదవగలిగే వయసు లేదు..

నా మనసు తపించే అమ్మ తనమా
లేదా నువ్వు చూపించే అభిమానమా??

ప్రేమతో నువ్వు కలిపే వరసలు
కురిపిస్తాయి నాలో చిరు జల్లులు

అమాయకపు నీ కళ్ళు, 
ఆశగా నువ్వడిగే ప్రశ్నలు,

ఆతృతగా నువ్వు విరిచే నటుకులు
మొహమాటపు నవ్వులు... 

తెలివితో కూడిన మాటలు
ముద్దుగా చేసే చేష్టలు..

నువ్వు ఏమి చేసినా అపురూపమే..
అన్నీ నాకు మురిపేమే..
ఉంటా నీతో కలకాలమే.. 

Monday, February 24, 2020

అమ్మ కొరకు

అమ్మ వెలితి తీర్చలేము
కానీ దేవుడిచ్చును అమ్మ రూపము..

భార్య కాదా అమ్మ , కడుపు నింపి నప్పుడు
అత్త కాదా, ప్రేమార అత్తమ్మ అన్నప్పుడు.

అక్క కాదా అమ్మ, మందలించినప్పుడు
వదిన కాదా, మంచి మాట ఆడినప్పుడు..

చింతిoచకు నీవు అమ్మ కొరకు
నీ గమ్యం చేరు వరకు
నీ శక్తి మేరకు

నీ అణువణువు ఆమె
నీ చుట్టూరా ఆమె ప్రేమే..



Friday, February 21, 2020

The mysterious being

నీ కళ్ళు black hole
నీ మనసు black box .

ఎప్పుడూ నిజం పలికే పెదవులు
ఆ మెదడు అర్ధం కాక మా తిప్పలు

నీ ఆలోచనలు ఒక pandora's box
చేస్తున్నాయి నన్ను curious

Am I standing too near,
and can't see the forest clear?

వెళ్లాలా 2 steps back,
చేయాలంటే నిన్ను crack ...









Thursday, February 20, 2020

ప్రేమ పావురాలు - చిన్ని కవిత

తొలి చూపులో కలిగిన ఆనందం
విడువకు కలకాలం 
ఎన్నాళ్లయినా ఉండనీ ఆ చిలిపి తనం 
జారిపోనీకు బాల్యం 
అప్పుడు మీ ప్రేమను చూసి లోకం 
అవ్వదా దాసోహం... 

Tuesday, February 18, 2020

ఋషి

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు...
మరి వారు ఋషులంటే, మనలాంటి మాములు మనుషులకు కనిపిస్తారా? వినిపిస్తారా?

మనుషులే ఋషులవుతుంటే, మరి ఈ కాలి యుగం లో వారు ఎలా ఉంటారు?
మనలాగా జీన్స్ చొక్కా వేసుకుంటారా? లేదా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలలో ఉంటారా?
మనలానే ఆకలి నిద్ర కోరికలు ఉంటాయా? ఉద్యోగాలు చేస్తారా? లేదా??

ఇదిగో
ఇదిగిదిగో

ఇలానే, నేను పప్పులో కాలు వేసేసా ఇప్పటికే...

ఋషి అనగానే, ఒక మనిషి, ఎలా ఉండాలో, ఏమి ధరించాలో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో అని మన బుర్రలో మనమే ఒక లెక్క రాసేసుకుని, అలా ఎవరూ లేరనో, మనము ఉండలేమనో తీర్మానానికి వచ్చేసి, ఇంక చేసిది ఏమి లేక, చచ్చిపోని శవంలా, జీవం లేని బ్రతుకులు బ్రతికేస్తాం.

ఎలాంటి ముందొస్తు ఆలోచనలు (అదే pre conceived notions ) లేకుండా, కలిసే ప్రతి వ్యక్తిని, ఎదురు పడే ప్రతి అవకాశాన్ని, మానను ఉత్తేజ పరిచే ప్రతి సంఘటనని, మన మనసుతో చూడగలిగితే??

ఒంటి కాలు పై తపస్సు చేసిన వాడు ఋషి అయితే, ఒక కాలు పై కుటుంబం, ఒక కాలు పై సమాజాన్ని మోసేవాడు??

ఓం కారాని జపించినవాడు ఋషి అయితే, మనుషుల మధ్య మమకారాన్ని పంచే వాడు??

దేవుడి పై ద్రుష్టి నిమఘ్నమ్ చేసేవాడు ఋషి అయితే, తన జీవితానికి దారి చూపిన మనిషిని దేవుడిగా ఆరాధించే వాడు?

తన లక్ష్యమే దేవుడు, పరుల హితమే సాధన, మౌనమే ఓంకారం, తన జీవితమే ఒక పరమార్ధంగా తీర్చిదిద్దుకుంటున్న ప్రతి మనిషీ ఋషే.. ఆ ప్రతి ఋషి ఒక కార్య సాధకుడే .

అలాంటి కార్యసాధకులకు నా శతకోటి వందనాలు... 

Monday, February 10, 2020

ఇంటి ముచ్చట్లు

కాకి కోయిల రాగాలు
మామిడి చెట్ల పూతలు
గుడి నుండి ఎం ఎస్ పాటలు

Exhaust లేని వంట గదులు
లేవగానే కళ్ళాపి ముగ్గులు
పసుపు కాళ్ళు, కుంకుమ మొహాలు

తులసి మొక్క పూజలు
పూజ గది లో దీపాలు
కచ్చ పోసిన చీర కట్లు

మెతుకు కింద పడితే కోపంతో చూపులు
ఆవుకు అక్షితల మొక్కులు
మనమే బలెక్కి కట్టే పూలు
పాడు పనులకు చెల్లి పెట్టే కేకలు
WhatsApp  లో  చకా ఛకా మిత్రులకు పోతున్న updatlu

వీధిలోని ఆత్మీయుల పలకరింపులు
కొంగు ఎగ్గొట్టి పరుగు పరుగున పెళ్లి పనులు

ఇవీ మా ఇంటి ముచ్చట్లు. 




Withdrawal

The phase of life, when you actively, consciously withdraw yourself from love and hate.  The moments when nothing seems to reach your heart....