Tuesday, February 18, 2020

ఋషి

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు...
మరి వారు ఋషులంటే, మనలాంటి మాములు మనుషులకు కనిపిస్తారా? వినిపిస్తారా?

మనుషులే ఋషులవుతుంటే, మరి ఈ కాలి యుగం లో వారు ఎలా ఉంటారు?
మనలాగా జీన్స్ చొక్కా వేసుకుంటారా? లేదా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలలో ఉంటారా?
మనలానే ఆకలి నిద్ర కోరికలు ఉంటాయా? ఉద్యోగాలు చేస్తారా? లేదా??

ఇదిగో
ఇదిగిదిగో

ఇలానే, నేను పప్పులో కాలు వేసేసా ఇప్పటికే...

ఋషి అనగానే, ఒక మనిషి, ఎలా ఉండాలో, ఏమి ధరించాలో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో అని మన బుర్రలో మనమే ఒక లెక్క రాసేసుకుని, అలా ఎవరూ లేరనో, మనము ఉండలేమనో తీర్మానానికి వచ్చేసి, ఇంక చేసిది ఏమి లేక, చచ్చిపోని శవంలా, జీవం లేని బ్రతుకులు బ్రతికేస్తాం.

ఎలాంటి ముందొస్తు ఆలోచనలు (అదే pre conceived notions ) లేకుండా, కలిసే ప్రతి వ్యక్తిని, ఎదురు పడే ప్రతి అవకాశాన్ని, మానను ఉత్తేజ పరిచే ప్రతి సంఘటనని, మన మనసుతో చూడగలిగితే??

ఒంటి కాలు పై తపస్సు చేసిన వాడు ఋషి అయితే, ఒక కాలు పై కుటుంబం, ఒక కాలు పై సమాజాన్ని మోసేవాడు??

ఓం కారాని జపించినవాడు ఋషి అయితే, మనుషుల మధ్య మమకారాన్ని పంచే వాడు??

దేవుడి పై ద్రుష్టి నిమఘ్నమ్ చేసేవాడు ఋషి అయితే, తన జీవితానికి దారి చూపిన మనిషిని దేవుడిగా ఆరాధించే వాడు?

తన లక్ష్యమే దేవుడు, పరుల హితమే సాధన, మౌనమే ఓంకారం, తన జీవితమే ఒక పరమార్ధంగా తీర్చిదిద్దుకుంటున్న ప్రతి మనిషీ ఋషే.. ఆ ప్రతి ఋషి ఒక కార్య సాధకుడే .

అలాంటి కార్యసాధకులకు నా శతకోటి వందనాలు... 

No comments:

Post a Comment

Withdrawal

The phase of life, when you actively, consciously withdraw yourself from love and hate.  The moments when nothing seems to reach your heart....