Tuesday, March 10, 2020

reliving childhood

నీ ప్రపంచం చాలా చిన్నదని తెలుసు,
కానీ సంపూర్ణమైనదని చూపించావు ...

స్నేహితులు కాదు బంధువులు అన్నావు
ఒకడు చిన్నోడో, ఒకడు పెద్ధోడు

చిన్న నాటి ముచ్చట్లు, ఇప్పుడు పెట్టావు
బాల్యపు ఆటలు ఇప్పుడు ఆడావు..

దానికి ఎందుకు వయసు?
చాలదా విసిగిన మనసు?

 అలుగుతున్నావు, మారం చేస్తున్నావు,
అమ్మ లాలన కరువా నీకు??

పసివాడిగా దిగుమింగుకున్నావు కన్నీళ్లు
ఇప్పుడు అవి అయ్యాయా హాస్యాలు?

ఎక్కడ ఉన్న చూసి నవ్వుతుంది మీ అమ్మ
మనసారా దీవిస్తుంది  తాను ప్రసాదించిన జన్మ.

ఆడుకో హాయిగా  ఆడుకో..
అలుపు వచ్చు వరకు.
కష్టం మరిచేంత వరకు.. 
కడుపు చల్లారే వరకు..
మనసు కుదుటపడు వరకు...

Wednesday, March 4, 2020

virus > cigarette??

ఆడెవు కదా ప్రకృతి తొ ఆటలు..
పెంచేవు కదా జనాభా అంతంతలు..

వదలలేదు గా గబ్బిలమును పామును
అయ్యెనగా gene manipulationu

Virus భయముతో మొఖానికి మాస్క్ కట్టు,
కానీ చేతిలో ఉంది గా పొగతో సిగరెట్టు

ప్రాణ భీతి కాదు నీది అపోహలో బ్రతకకు
రేపో మాపో నీ చేతిలోనే ఉంది నీ చావు..

వైరస్ నీకు unknown friend aa
సిగరెట్టు known enemy aa?

Virus nu నేను చూసినాను పరోక్షంగా
జీవం లేని ఒక రసాయనంగా

అది ఉండును ఈరోజు పోవును రేపు
కానీ నీ చేతిలోనిది చంపును నిన్ను క్షణ క్షణము. 

Monday, March 2, 2020

marupuraani railu prayanam

జీవితాన్ని ఒక రైలు ప్రయాణం లో నేర్చుకోవచ్చేమో అనిపించే ప్రయాణం లో ఉన్నా
ఈ అనుభవాన్ని కవిత రూపం లో ప్రాసలు వాడి రాయాలా లేదా ఒక కథ లా రాయాలా??

నాది సైడ్ అప్పర్ బెర్త్. నా ఫోన్ లో నిమఘ్నమ్ కాకుండా, చుట్టూరా మనుషులను చూడడం అలవాటు. 

నా ఎడమ వైపు, ఇంకా 4-5 నెలలు కూడా నిండని ఒక చిన్న పాపాయి ఏడుపు. ఎంత ఊరుకో పెట్టిన సౌకర్యంగా లేదేమో పాపం. ఆ తల్లి ఎంత బాధ లో ఉందో మనకి తెలీదు, కానీ, అందరికి డిస్టర్బన్స్ లేకుండా ఓదార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

నా ఎదురుగా, అప్పుడే పెళ్లి చూపులు ముగించుకుని వస్తున్న ఒక జంట, వారి అబ్బాయి.. అమ్మాయి కను  ముక్కు తీరు బావున్నాయి.. భీమవరం మాములు కాలేజీ లో చదివి కూడా 8 లక్షల జీతం అంటే తెలివైన పిల్లే, మన మాధవి తో పోటీ రాదనుకో, కానీ మాకు తెలిసిన వాళ్ళే, సో బాగా మాట్లాడారు, మా వాడే ఇంకా 50 50 అంటున్నాడు, గట్టిగా, ఎస్ చెప్పడం లేదు అని ఆవిడ ఎవరికో ఫోన్లో అప్డేట్ ఇస్తున్నారు..

నా కుడి వైపు, అప్పుడే బామ్మ గారి చావు వార్త విన్న, ఒక ఆవిడ, ఒక టీనేజ్ అమ్మాయి, ఒక అయిదేళ్ల పాప. . బియ్యం వేసి దీపం వెలిగించు, యూట్యూబ్ లో భగవద్గీత పెట్టు స్పీకర్ లో, బొటన వేళ్ళు రెండు కలిపి కట్టు అని ఏడుస్తూ చెప్పగా...  అమ్మ, రోషన్ కి నాయనమ్మ అంటే ప్రాణం కదా, వాడికి వెడ్నెస్డే ఎక్సమ్ కూడా ఉంది అమ్మ, నేను వాడితో ఇప్పుడు మాట్లాడొచ్చా, అని ఆ పాప.. ఇవేమీ సంబంధం లేకుండా చూ చూ రైలు ఎక్కుదము అని చిన్న పాపా పాటలు...

జీవితం అంతే ఇంతేనా అని నేను ఒక నిట్టూర్పుతో అలా రోజుని ముగించా. .



Sunday, March 1, 2020

Colorful in Black and White

ఒంటి మీద బట్టలు నలుపు తెలుపు అయితేనేం?
ఉన్నాయిగా నీలో  చాలా రంగులు !!

తళుక్కుమని మెరిసే నీ కళ్ళు పసుపు 
నీ పెదవులపై నవ్వు అద్దినది ఎరుపు 

మృదువాటి వేళ్ళు  గులాబీ అయితే,
చక చక అడుగులు వేసే కాళ్ళు పచ్చే ..  

 విశాలమైన నీ హృదయం నీలం 
ఉంచుకో ఆ మంచితనం కలకాలం. 

Ego vs Self Respect

 They say that there's a very thin line between ego and self respect.  I'm not mature enough to  1. Understand that line 2. How to d...