Tuesday, March 10, 2020

reliving childhood

నీ ప్రపంచం చాలా చిన్నదని తెలుసు,
కానీ సంపూర్ణమైనదని చూపించావు ...

స్నేహితులు కాదు బంధువులు అన్నావు
ఒకడు చిన్నోడో, ఒకడు పెద్ధోడు

చిన్న నాటి ముచ్చట్లు, ఇప్పుడు పెట్టావు
బాల్యపు ఆటలు ఇప్పుడు ఆడావు..

దానికి ఎందుకు వయసు?
చాలదా విసిగిన మనసు?

 అలుగుతున్నావు, మారం చేస్తున్నావు,
అమ్మ లాలన కరువా నీకు??

పసివాడిగా దిగుమింగుకున్నావు కన్నీళ్లు
ఇప్పుడు అవి అయ్యాయా హాస్యాలు?

ఎక్కడ ఉన్న చూసి నవ్వుతుంది మీ అమ్మ
మనసారా దీవిస్తుంది  తాను ప్రసాదించిన జన్మ.

ఆడుకో హాయిగా  ఆడుకో..
అలుపు వచ్చు వరకు.
కష్టం మరిచేంత వరకు.. 
కడుపు చల్లారే వరకు..
మనసు కుదుటపడు వరకు...

No comments:

Post a Comment

karu mabbulu

ఊరు మొత్తం కారు మబ్బులు కప్పేసాయి, నా మనసును మీ ఆలోచనలు కప్పేసినట్టు..........