Monday, March 2, 2020

marupuraani railu prayanam

జీవితాన్ని ఒక రైలు ప్రయాణం లో నేర్చుకోవచ్చేమో అనిపించే ప్రయాణం లో ఉన్నా
ఈ అనుభవాన్ని కవిత రూపం లో ప్రాసలు వాడి రాయాలా లేదా ఒక కథ లా రాయాలా??

నాది సైడ్ అప్పర్ బెర్త్. నా ఫోన్ లో నిమఘ్నమ్ కాకుండా, చుట్టూరా మనుషులను చూడడం అలవాటు. 

నా ఎడమ వైపు, ఇంకా 4-5 నెలలు కూడా నిండని ఒక చిన్న పాపాయి ఏడుపు. ఎంత ఊరుకో పెట్టిన సౌకర్యంగా లేదేమో పాపం. ఆ తల్లి ఎంత బాధ లో ఉందో మనకి తెలీదు, కానీ, అందరికి డిస్టర్బన్స్ లేకుండా ఓదార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

నా ఎదురుగా, అప్పుడే పెళ్లి చూపులు ముగించుకుని వస్తున్న ఒక జంట, వారి అబ్బాయి.. అమ్మాయి కను  ముక్కు తీరు బావున్నాయి.. భీమవరం మాములు కాలేజీ లో చదివి కూడా 8 లక్షల జీతం అంటే తెలివైన పిల్లే, మన మాధవి తో పోటీ రాదనుకో, కానీ మాకు తెలిసిన వాళ్ళే, సో బాగా మాట్లాడారు, మా వాడే ఇంకా 50 50 అంటున్నాడు, గట్టిగా, ఎస్ చెప్పడం లేదు అని ఆవిడ ఎవరికో ఫోన్లో అప్డేట్ ఇస్తున్నారు..

నా కుడి వైపు, అప్పుడే బామ్మ గారి చావు వార్త విన్న, ఒక ఆవిడ, ఒక టీనేజ్ అమ్మాయి, ఒక అయిదేళ్ల పాప. . బియ్యం వేసి దీపం వెలిగించు, యూట్యూబ్ లో భగవద్గీత పెట్టు స్పీకర్ లో, బొటన వేళ్ళు రెండు కలిపి కట్టు అని ఏడుస్తూ చెప్పగా...  అమ్మ, రోషన్ కి నాయనమ్మ అంటే ప్రాణం కదా, వాడికి వెడ్నెస్డే ఎక్సమ్ కూడా ఉంది అమ్మ, నేను వాడితో ఇప్పుడు మాట్లాడొచ్చా, అని ఆ పాప.. ఇవేమీ సంబంధం లేకుండా చూ చూ రైలు ఎక్కుదము అని చిన్న పాపా పాటలు...

జీవితం అంతే ఇంతేనా అని నేను ఒక నిట్టూర్పుతో అలా రోజుని ముగించా. .



No comments:

Post a Comment

The WHOLE POINT

 I had 2 incidents last couple of months, with kids. As usual, when I meet a kid, somehow there is always something to learn.  So, he is a 5...