Thursday, April 30, 2020

Always the second choice

ఒక తరగతి లో 9 మంది గుంపుగా స్నేహితులు అయ్యారు..
వారి అనుబంధం చూడ ముచ్చటగా ఉంటుంది.
9 మంది ఒకేసారి తినడం, తిరగడం, సినిమాలు , షికార్లు..

అలా జరుగుతుండగా, 9 మంది లో ఇద్దరిద్దరు థిక్ ఫ్రెండ్స్ లేదా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.. ఒకరు మాత్రం మిగిలిపోయారు.

కారణాలు మంచి చెడు అన్నీ ఉన్నాయ్..

కానీ, ఆ ఒంటి పిల్లని, ఎవరు వదిలే వారు కారు. ఆ జతలు, వారి 3rd  wheel  కింద ఆ పిల్లని అన్నిటికి పిలిచే వారు.

కానీ ఎప్పుడు వారి బెస్ట్ ఫ్రెండ్ తర్వాత సెకండ్ ఆప్షన్ కిందే...

నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందే, ఎవరికీ చెప్పలేదు, దాని తరువాత నీకే...
బయటకి  వెళ్ళడానికి నేను అది ప్లాన్ చేసాం, నువ్వు వస్తావా?
దానికి నాకు మూవీ టికెట్స్ తీసుకున్న , అది రానంది, నువ్వు వస్తావా?

అలా  ఆ 4 బ్యాచ్ లు ఈ ఒంటి పిల్లని పిలుస్తారు.
సో ఆ ఒంటి పిల్లకి ఏదో మిస్ అవుతున్న. నాకు స్నేహితులు లేరు అని ఎప్పుడు అనిపించేది కాదు.

కానీ ఒక రోజు వచ్చే వచ్చింది. అందరి దారులు వేరు అయ్యాయి.. అందరి ప్రియరిటిస్ మారాయి, ఎవరి జీవితం వారికి మొదలయింది. ఎవరి కష్టాలు వారు పడుతున్నారు.

అందరు వారి వారి బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నారు. ఈ ఒంటి పిల్లకి ఎవరితో మాట్లాడాలి అని అర్ధం కాలేదు. ఎవరికీ కాల్ చేసిన, బిజీ అనో, తర్వాత మాట్లాడదాం అనో అన్నారు.

ఆ రోజు ఆ ఒంటి పిల్లకి అర్ధం అయినా విషయం.....

నేను అందరితో ఉన్న కాలంలో ఎవరితో మరీ చనువుగా మెలగలేదు. టచ్ మీ నాట్  లాగ, ఉండి లేనట్టు ఉన్న.
మంచి చెడు ఏదైనా నాకు సంబంధం లేదు, మీ  ఏడుపు మీరు ఏడవండి అని వదిలేసా ...
అందరితో మంచిగానే ఉన్నా, అందరిని ఇంప్రెస్స్ చేయాలి, వారు ఏది చెప్పిన ఉ కొట్టి సరే అని పక్కకి పోయాను.. అని..

ఒక బంధం లో ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి అంటే, ఆ మనిషి ని అర్ధం చేసుకోవడమే కాదు, ప్రేమ తో పాటు గౌరవం, మంచిగా ఉండడం తో పాటు, తప్పు చేసినప్పుఫు మందలించాలడం, సహాయం అడగడం తో పాటు, నేనున్నానని చేయి అందించడం..

కానీ, ఇవన్నీ తెలిసే సమయానికి ఈ ఒంటి పిల్లకి చాలా ఆలస్యం అయ్యింది.

she  is  just one  life time late . ... .... 





No comments:

Post a Comment

Withdrawal

The phase of life, when you actively, consciously withdraw yourself from love and hate.  The moments when nothing seems to reach your heart....