Skip to main content

Posts

Showing posts from February, 2020

అందని ద్రాక్ష పుల్లన

అందని ద్రాక్ష పుల్లనంటారు కానీ ఆ నక్క తాపత్రయం, కోరిక, ఆశకి సమాధానం ఇవ్వలేదు .. ఒక కష్టమైన బాటను ఎంచుకుని, అవాంతరాలను ఎదురుకుని ఏదో సాధించాలని పయనం మొదలెట్టి సమాజం  నిర్దేశించిన స్థాయికి చేరలేక పెట్టిన అచ్చులో ఇమడలేక ఇచ్చిన కొలతను అందుకోక పక్కవారితో తూగలేక ఓటమిని ఒప్పుకోక ఈ ప్రయాణమే ఒక గమ్యం అని నా అనుభవమే నా ఆస్తి అని ఏడ్చే ధైర్యం లేక ఇంకా పోరాడే సహనం లేక ఆట ఆపే మనసు రాక ఆఖరికి గుంపుతో కలిసిపోయి అందని ద్రాక్ష పుల్లనలే అని సద్దుకుపోయింది ఆ నక్క ...

ఉంటా నీతో

తొమ్మిది నెలలు నిన్ను మోయలేదు.. నిన్ను చదవగలిగే వయసు లేదు.. నా మనసు తపించే అమ్మ తనమా లేదా నువ్వు చూపించే అభిమానమా?? ప్రేమతో నువ్వు కలిపే వరసలు కురిపిస్తాయి నాలో చిరు జల్లులు అమాయకపు నీ కళ్ళు,  ఆశగా నువ్వడిగే ప్రశ్నలు, ఆతృతగా నువ్వు విరిచే నటుకులు మొహమాటపు నవ్వులు...  తెలివితో కూడిన మాటలు ముద్దుగా చేసే చేష్టలు.. నువ్వు ఏమి చేసినా అపురూపమే.. అన్నీ నాకు మురిపేమే.. ఉంటా నీతో కలకాలమే.. 

అమ్మ కొరకు

అమ్మ వెలితి తీర్చలేము కానీ దేవుడిచ్చును అమ్మ రూపము.. భార్య కాదా అమ్మ , కడుపు నింపి నప్పుడు అత్త కాదా, ప్రేమార అత్తమ్మ అన్నప్పుడు. అక్క కాదా అమ్మ, మందలించినప్పుడు వదిన కాదా, మంచి మాట ఆడినప్పుడు.. చింతిoచకు నీవు అమ్మ కొరకు నీ గమ్యం చేరు వరకు నీ శక్తి మేరకు నీ అణువణువు ఆమె నీ చుట్టూరా ఆమె ప్రేమే..

The mysterious being

నీ కళ్ళు black hole నీ మనసు black box . ఎప్పుడూ నిజం పలికే పెదవులు ఆ మెదడు అర్ధం కాక మా తిప్పలు నీ ఆలోచనలు ఒక pandora's box చేస్తున్నాయి నన్ను curious Am I standing too near, and can't see the forest clear? వెళ్లాలా 2 steps back, చేయాలంటే నిన్ను crack ...

ప్రేమ పావురాలు - చిన్ని కవిత

తొలి చూపులో కలిగిన ఆనందం విడువకు కలకాలం  ఎన్నాళ్లయినా ఉండనీ ఆ చిలిపి తనం  జారిపోనీకు బాల్యం  అప్పుడు మీ ప్రేమను చూసి లోకం  అవ్వదా దాసోహం... 

ఋషి

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు... మరి వారు ఋషులంటే, మనలాంటి మాములు మనుషులకు కనిపిస్తారా? వినిపిస్తారా? మనుషులే ఋషులవుతుంటే, మరి ఈ కాలి యుగం లో వారు ఎలా ఉంటారు? మనలాగా జీన్స్ చొక్కా వేసుకుంటారా? లేదా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలలో ఉంటారా? మనలానే ఆకలి నిద్ర కోరికలు ఉంటాయా? ఉద్యోగాలు చేస్తారా? లేదా?? ఇదిగో ఇదిగిదిగో ఇలానే, నేను పప్పులో కాలు వేసేసా ఇప్పటికే... ఋషి అనగానే, ఒక మనిషి, ఎలా ఉండాలో, ఏమి ధరించాలో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో అని మన బుర్రలో మనమే ఒక లెక్క రాసేసుకుని, అలా ఎవరూ లేరనో, మనము ఉండలేమనో తీర్మానానికి వచ్చేసి, ఇంక చేసిది ఏమి లేక, చచ్చిపోని శవంలా, జీవం లేని బ్రతుకులు బ్రతికేస్తాం. ఎలాంటి ముందొస్తు ఆలోచనలు (అదే pre conceived notions ) లేకుండా, కలిసే ప్రతి వ్యక్తిని, ఎదురు పడే ప్రతి అవకాశాన్ని, మానను ఉత్తేజ పరిచే ప్రతి సంఘటనని, మన మనసుతో చూడగలిగితే?? ఒంటి కాలు పై తపస్సు చేసిన వాడు ఋషి అయితే, ఒక కాలు పై కుటుంబం, ఒక కాలు పై సమాజాన్ని మోసేవాడు?? ఓం కారాని జపించినవాడు ఋషి అయితే, మనుషుల మధ్య మమకారాన్ని పంచే వాడు?? దేవుడి పై ద్రుష్టి నిమఘ్న...

ఇంటి ముచ్చట్లు

కాకి కోయిల రాగాలు మామిడి చెట్ల పూతలు గుడి నుండి ఎం ఎస్ పాటలు Exhaust లేని వంట గదులు లేవగానే కళ్ళాపి ముగ్గులు పసుపు కాళ్ళు, కుంకుమ మొహాలు తులసి మొక్క పూజలు పూజ గది లో దీపాలు కచ్చ పోసిన చీర కట్లు మెతుకు కింద పడితే కోపంతో చూపులు ఆవుకు అక్షితల మొక్కులు మనమే బలెక్కి కట్టే పూలు పాడు పనులకు చెల్లి పెట్టే కేకలు WhatsApp  లో  చకా ఛకా మిత్రులకు పోతున్న updatlu వీధిలోని ఆత్మీయుల పలకరింపులు కొంగు ఎగ్గొట్టి పరుగు పరుగున పెళ్లి పనులు ఇవీ మా ఇంటి ముచ్చట్లు.