Skip to main content

Posts

Showing posts from April, 2020

Always the second choice

ఒక తరగతి లో 9 మంది గుంపుగా స్నేహితులు అయ్యారు.. వారి అనుబంధం చూడ ముచ్చటగా ఉంటుంది. 9 మంది ఒకేసారి తినడం, తిరగడం, సినిమాలు , షికార్లు.. అలా జరుగుతుండగా, 9 మంది లో ఇద్దరిద్దరు థిక్ ఫ్రెండ్స్ లేదా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.. ఒకరు మాత్రం మిగిలిపోయారు. కారణాలు మంచి చెడు అన్నీ ఉన్నాయ్.. కానీ, ఆ ఒంటి పిల్లని, ఎవరు వదిలే వారు కారు. ఆ జతలు, వారి 3rd  wheel  కింద ఆ పిల్లని అన్నిటికి పిలిచే వారు. కానీ ఎప్పుడు వారి బెస్ట్ ఫ్రెండ్ తర్వాత సెకండ్ ఆప్షన్ కిందే... నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందే, ఎవరికీ చెప్పలేదు, దాని తరువాత నీకే... బయటకి  వెళ్ళడానికి నేను అది ప్లాన్ చేసాం, నువ్వు వస్తావా? దానికి నాకు మూవీ టికెట్స్ తీసుకున్న , అది రానంది, నువ్వు వస్తావా? అలా  ఆ 4 బ్యాచ్ లు ఈ ఒంటి పిల్లని పిలుస్తారు. సో ఆ ఒంటి పిల్లకి ఏదో మిస్ అవుతున్న. నాకు స్నేహితులు లేరు అని ఎప్పుడు అనిపించేది కాదు. కానీ ఒక రోజు వచ్చే వచ్చింది. అందరి దారులు వేరు అయ్యాయి.. అందరి ప్రియరిటిస్ మారాయి, ఎవరి జీవితం వారికి మొదలయింది. ఎవరి కష్టాలు వారు పడుతున్నారు. అందరు వారి వారి బెస్ట్ ఫ్రెండ్ తో మాట్...

ప్రకృతిని తలపించే మిత్రులు

గత కొద్ది రోజులుగా నా పుట్టిన ఊరు అయిన విశాఖపట్నం బాగా గుర్తుకు వస్తోంది.. అలా సాగర తీరం లో కూర్చుని, కాలాన్ని మర్చిపోయి, వేరే ప్రపంచంలోకి వెళ్లి, విహారం చేసి రావాలనిపించింది.. అది జరగని పని కానీ అదే అనుభూతిని ఇచ్చిన మిత్రులు పక్కనే ఉన్నారు..  ఒకరు పైకి కిందకి లేచి పడే కెరటం లాగ. ఒక రోజు చాల సరదాగా, అతి ఉత్సాహంగా కబుర్లు చెప్తే, ఇంకో రోజు ఇంతేనా జీవితం అని నీరు కార్చే మాటలు.. మన పాదాలకు చల్లగా తాకే అలలు గుర్తుకొస్తాయి. ఆడుకోవాలి అని ఎంత అనిపిస్తుందో, లోపాలకి వెళ్ళకూడదు అని కూడా అంతే భయం వేస్తుంది.  ఇంకొకరు, ఆ సాగర తీరం లో కూర్చుని ఉండగా మనని  తాకే గాలి లాగ.. గాలితో పాటు వినపడే ఆ గాలి మరియు కెరటాల శబ్దం. అదే లేకపోతే ఆ సముద్రానికి కళే  లేదేమో అనిపిస్తుంది. ఒక సారి హోరున వీస్తే, ఇంకో సారి చల్లగా వీస్తుంది. ఎంత సరదా ఓ అంతే లోతు.. కళ్ళు మూసుకుపోయినా, మనసు బండబారిపోయిన, చలింపగలిగే శక్తి ఆ గాలికే ఉంది కదా. .  ఇక పెద్దగా పాత్ర ఏమి లేదు అనిపించినా, పొడి పొడి సమాధానాలు చెప్పినా , మా జీవితాల్లో ఒక రుచిని నింపిన బంధం. ఆ కడలి కలయిక మిగిల్చేది నోటికి ...