Skip to main content

Posts

Showing posts from 2020

prema kopam

నీ ప్రేమను దగ్గరగా అనుభవించిన వారు ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోరు.. నీ కోపాన్ని దూరం నుండి రుచి చూసిన వారు ఎప్పటికీ నిన్ను దగ్గరకి రానియ్యారు..

వంటరి పక్షి

సమయం అర్ధ రాత్రి కావొస్తోంది.. నిద్ర పట్టక అలా చల్ల గాలికి బయటకి వచ్చాను.. వీధి దీపం తప్ప ఏమీ లేక చీకటి.. ఎదురింటి ఒక గది లో వెలుతురు ఉంది.. అక్కడ కిటికీ నుండి కనిపిస్తూ ఒక పక్షి ఆకారం... అది ఆ గది లో ఉన్న బొమ్మా లేక బయట ఉన్న నిజం పక్షా అని అర్థం కాలేదు... కానీ కుతూహలంతో అలానే చూస్తూ ఉండగా అది కదల సాగింది... అప్పుడు నిజమైన పావురమే అని అర్థం అయ్యింది.. ఇంకా చూడగా.......... దాని కదలికలు........ చాలా క్షోభ పడుత ఉన్నట్టు ఉన్నాయి... వంటరిగా దారి తప్పి, చీకటి పడక ముందే ఇంటికి చేరలేక, ఎటు పోవాలో తెలికా అక్కడ ఇరుక్కు పోయింది...  ఎవరైనా వచ్చి నా కోసం వేతుకుంటారేమో, దారి చుపిస్తరేమో, ధైర్యం చెప్తారేమో,  నా బాధను అర్థం చేసుకుని,  నా కన్నీళ్లను తుడిచి,  ఓడారుస్తారేమో  అని అది ఎదురుచూస్తున్నట్లు అనిపించింది... కానీ అవేవీ జరగవ్.. బిక్కు బిక్కు మంటూ... ఈ రాత్రి ఎలాగైనా గడపల్సిందే,  సూర్యోదయం కోసం వేచి చూడాల్సిందే... కొత్త రోజు కోసం ఆగాల్సిందే... మనకి మనమే ధైర్యం చెప్పుకోవల్సిందే... మన గుండెను నిబ్బరం చ...

Inspiration vs Expectation

I wrote a post about expectations long back. That was a hit :-P People said, I could do a Ph.D. on expectations. So now, here I present, my next beautiful piece.  Inspiration vs Expectation. These 2 terms sound very separate and you may feel there is no point in comparing these two or rather there is nothing to be versed about both. So here goes the story. Imagine.... There was this highly successful person as per societal standards. Who owns a house, a couple of cars, a happy family, a debt-free life. So at one point in our life, when we just start out or when look for someone to look up to or a ray or hope when low, this person seems like a mega hero to us.  He INSPIRES us to be like him or at least to get what he has materialistically or even more, mentors us to reach where we want to go.  And as the days go on, with the virtue of our hardwork and his INSPIRATION, we reach a point where he is at his life.  Then suddenly, the inspiration changes and turns to become...

Incredible insight

Was hearing to an interview with Simon Sinek with Tom Bilyeu. Simon sinek mentioned a few characteristics of Millenials (born after 1984) which makes them difficult to manage. Instant gratification, entitled, narcissist, self-centered, lazy...... The reasons being Parenting, technology, impatience, and the environment. And Parenting is one major thing I am working on. Working on a huge module of the curriculum in place. Rules, how to teach certain principles in life, how to live as a principle-centered person etc etc. Link to the video here:  https://www.youtube.com/watch?v=QKG4v0oKXRw

Lockdown Life

I'm coming out of this lockdown with Lesser hair Tighter clothes Roughened palms Aching calf muscles Dried up skin Puffed up eyes Hardened heart Lightened soul Messed up hormones  I became more judgemental less caring more indifferent less tensed more irritated Yes, I am organized, but No, I did not make any new habits, nor exercised every day. Yes, I cooked every single day, very tasty meals, but No, I did not eat on time. Yes, I worked from home, even on weekends, but No, I did not learn any new skills. Yes, I did not have a single minute for myself, but No, I did not crib, I still wrote, I still drew, I still read. This lockdown did not teach me great stuff but reinforced many things to make me a better person. 

Is this mid-life crisis?

I am in a stage of life, where I feel weird most of the time. So the mid-life crisis I am referring to here is not the financial crisis but a mental crisis. A feeling that I am not able to understand, articulate, express, and not settle with nor accept it. So yeah, coming to what this is... (to be really frank, there were hundreds of situations I felt will fall under this post, but when I really sit to write, I am just lost in thoughts. It's already day 3 I started writing this.. Phewwww) I want to be this queen bee. Bossing around people. Standing tall. Always setting right and high standards to others. Be extremely disciplined. Fix everything in my life, from health to relationships to career to hobbies. Want to get everything done. On the other side, I want to be this little child. Who does not know where she is going. Laughing around with people. Having fun. Being played at. Being teased at. Not want to do anything. Watch the skies moving, leaves dancing, birds chirpin...

Always the second choice

ఒక తరగతి లో 9 మంది గుంపుగా స్నేహితులు అయ్యారు.. వారి అనుబంధం చూడ ముచ్చటగా ఉంటుంది. 9 మంది ఒకేసారి తినడం, తిరగడం, సినిమాలు , షికార్లు.. అలా జరుగుతుండగా, 9 మంది లో ఇద్దరిద్దరు థిక్ ఫ్రెండ్స్ లేదా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.. ఒకరు మాత్రం మిగిలిపోయారు. కారణాలు మంచి చెడు అన్నీ ఉన్నాయ్.. కానీ, ఆ ఒంటి పిల్లని, ఎవరు వదిలే వారు కారు. ఆ జతలు, వారి 3rd  wheel  కింద ఆ పిల్లని అన్నిటికి పిలిచే వారు. కానీ ఎప్పుడు వారి బెస్ట్ ఫ్రెండ్ తర్వాత సెకండ్ ఆప్షన్ కిందే... నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందే, ఎవరికీ చెప్పలేదు, దాని తరువాత నీకే... బయటకి  వెళ్ళడానికి నేను అది ప్లాన్ చేసాం, నువ్వు వస్తావా? దానికి నాకు మూవీ టికెట్స్ తీసుకున్న , అది రానంది, నువ్వు వస్తావా? అలా  ఆ 4 బ్యాచ్ లు ఈ ఒంటి పిల్లని పిలుస్తారు. సో ఆ ఒంటి పిల్లకి ఏదో మిస్ అవుతున్న. నాకు స్నేహితులు లేరు అని ఎప్పుడు అనిపించేది కాదు. కానీ ఒక రోజు వచ్చే వచ్చింది. అందరి దారులు వేరు అయ్యాయి.. అందరి ప్రియరిటిస్ మారాయి, ఎవరి జీవితం వారికి మొదలయింది. ఎవరి కష్టాలు వారు పడుతున్నారు. అందరు వారి వారి బెస్ట్ ఫ్రెండ్ తో మాట్...

ప్రకృతిని తలపించే మిత్రులు

గత కొద్ది రోజులుగా నా పుట్టిన ఊరు అయిన విశాఖపట్నం బాగా గుర్తుకు వస్తోంది.. అలా సాగర తీరం లో కూర్చుని, కాలాన్ని మర్చిపోయి, వేరే ప్రపంచంలోకి వెళ్లి, విహారం చేసి రావాలనిపించింది.. అది జరగని పని కానీ అదే అనుభూతిని ఇచ్చిన మిత్రులు పక్కనే ఉన్నారు..  ఒకరు పైకి కిందకి లేచి పడే కెరటం లాగ. ఒక రోజు చాల సరదాగా, అతి ఉత్సాహంగా కబుర్లు చెప్తే, ఇంకో రోజు ఇంతేనా జీవితం అని నీరు కార్చే మాటలు.. మన పాదాలకు చల్లగా తాకే అలలు గుర్తుకొస్తాయి. ఆడుకోవాలి అని ఎంత అనిపిస్తుందో, లోపాలకి వెళ్ళకూడదు అని కూడా అంతే భయం వేస్తుంది.  ఇంకొకరు, ఆ సాగర తీరం లో కూర్చుని ఉండగా మనని  తాకే గాలి లాగ.. గాలితో పాటు వినపడే ఆ గాలి మరియు కెరటాల శబ్దం. అదే లేకపోతే ఆ సముద్రానికి కళే  లేదేమో అనిపిస్తుంది. ఒక సారి హోరున వీస్తే, ఇంకో సారి చల్లగా వీస్తుంది. ఎంత సరదా ఓ అంతే లోతు.. కళ్ళు మూసుకుపోయినా, మనసు బండబారిపోయిన, చలింపగలిగే శక్తి ఆ గాలికే ఉంది కదా. .  ఇక పెద్దగా పాత్ర ఏమి లేదు అనిపించినా, పొడి పొడి సమాధానాలు చెప్పినా , మా జీవితాల్లో ఒక రుచిని నింపిన బంధం. ఆ కడలి కలయిక మిగిల్చేది నోటికి ...

reliving childhood

నీ ప్రపంచం చాలా చిన్నదని తెలుసు, కానీ సంపూర్ణమైనదని చూపించావు ... స్నేహితులు కాదు బంధువులు అన్నావు ఒకడు చిన్నోడో, ఒకడు పెద్ధోడు చిన్న నాటి ముచ్చట్లు, ఇప్పుడు పెట్టావు బాల్యపు ఆటలు ఇప్పుడు ఆడావు.. దానికి ఎందుకు వయసు? చాలదా విసిగిన మనసు?  అలుగుతున్నావు, మారం చేస్తున్నావు, అమ్మ లాలన కరువా నీకు?? పసివాడిగా దిగుమింగుకున్నావు కన్నీళ్లు ఇప్పుడు అవి అయ్యాయా హాస్యాలు? ఎక్కడ ఉన్న చూసి నవ్వుతుంది మీ అమ్మ మనసారా దీవిస్తుంది  తాను ప్రసాదించిన జన్మ. ఆడుకో హాయిగా  ఆడుకో.. అలుపు వచ్చు వరకు. కష్టం మరిచేంత వరకు..  కడుపు చల్లారే వరకు.. మనసు కుదుటపడు వరకు...

virus > cigarette??

ఆడెవు కదా ప్రకృతి తొ ఆటలు.. పెంచేవు కదా జనాభా అంతంతలు.. వదలలేదు గా గబ్బిలమును పామును అయ్యెనగా gene manipulationu Virus భయముతో మొఖానికి మాస్క్ కట్టు, కానీ చేతిలో ఉంది గా పొగతో సిగరెట్టు ప్రాణ భీతి కాదు నీది అపోహలో బ్రతకకు రేపో మాపో నీ చేతిలోనే ఉంది నీ చావు.. వైరస్ నీకు unknown friend aa సిగరెట్టు known enemy aa? Virus nu నేను చూసినాను పరోక్షంగా జీవం లేని ఒక రసాయనంగా అది ఉండును ఈరోజు పోవును రేపు కానీ నీ చేతిలోనిది చంపును నిన్ను క్షణ క్షణము. 

marupuraani railu prayanam

జీవితాన్ని ఒక రైలు ప్రయాణం లో నేర్చుకోవచ్చేమో అనిపించే ప్రయాణం లో ఉన్నా ఈ అనుభవాన్ని కవిత రూపం లో ప్రాసలు వాడి రాయాలా లేదా ఒక కథ లా రాయాలా?? నాది సైడ్ అప్పర్ బెర్త్. నా ఫోన్ లో నిమఘ్నమ్ కాకుండా, చుట్టూరా మనుషులను చూడడం అలవాటు.  నా ఎడమ వైపు, ఇంకా 4-5 నెలలు కూడా నిండని ఒక చిన్న పాపాయి ఏడుపు. ఎంత ఊరుకో పెట్టిన సౌకర్యంగా లేదేమో పాపం. ఆ తల్లి ఎంత బాధ లో ఉందో మనకి తెలీదు, కానీ, అందరికి డిస్టర్బన్స్ లేకుండా ఓదార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. నా ఎదురుగా, అప్పుడే పెళ్లి చూపులు ముగించుకుని వస్తున్న ఒక జంట, వారి అబ్బాయి.. అమ్మాయి కను  ముక్కు తీరు బావున్నాయి.. భీమవరం మాములు కాలేజీ లో చదివి కూడా 8 లక్షల జీతం అంటే తెలివైన పిల్లే, మన మాధవి తో పోటీ రాదనుకో, కానీ మాకు తెలిసిన వాళ్ళే, సో బాగా మాట్లాడారు, మా వాడే ఇంకా 50 50 అంటున్నాడు, గట్టిగా, ఎస్ చెప్పడం లేదు అని ఆవిడ ఎవరికో ఫోన్లో అప్డేట్ ఇస్తున్నారు.. నా కుడి వైపు, అప్పుడే బామ్మ గారి చావు వార్త విన్న, ఒక ఆవిడ, ఒక టీనేజ్ అమ్మాయి, ఒక అయిదేళ్ల పాప. . బియ్యం వేసి దీపం వెలిగించు, యూట్యూబ్ లో భగవద్గీత పెట్టు స్పీకర్ లో, బొటన వేళ...

Colorful in Black and White

ఒంటి మీద బట్టలు నలుపు తెలుపు అయితేనేం? ఉన్నాయిగా నీలో  చాలా రంగులు !! తళుక్కుమని మెరిసే నీ కళ్ళు పసుపు  నీ పెదవులపై నవ్వు అద్దినది ఎరుపు  మృదువాటి వేళ్ళు  గులాబీ అయితే, చక చక అడుగులు వేసే కాళ్ళు పచ్చే ..    విశాలమైన నీ హృదయం నీలం  ఉంచుకో ఆ మంచితనం కలకాలం. 

అందని ద్రాక్ష పుల్లన

అందని ద్రాక్ష పుల్లనంటారు కానీ ఆ నక్క తాపత్రయం, కోరిక, ఆశకి సమాధానం ఇవ్వలేదు .. ఒక కష్టమైన బాటను ఎంచుకుని, అవాంతరాలను ఎదురుకుని ఏదో సాధించాలని పయనం మొదలెట్టి సమాజం  నిర్దేశించిన స్థాయికి చేరలేక పెట్టిన అచ్చులో ఇమడలేక ఇచ్చిన కొలతను అందుకోక పక్కవారితో తూగలేక ఓటమిని ఒప్పుకోక ఈ ప్రయాణమే ఒక గమ్యం అని నా అనుభవమే నా ఆస్తి అని ఏడ్చే ధైర్యం లేక ఇంకా పోరాడే సహనం లేక ఆట ఆపే మనసు రాక ఆఖరికి గుంపుతో కలిసిపోయి అందని ద్రాక్ష పుల్లనలే అని సద్దుకుపోయింది ఆ నక్క ...

ఉంటా నీతో

తొమ్మిది నెలలు నిన్ను మోయలేదు.. నిన్ను చదవగలిగే వయసు లేదు.. నా మనసు తపించే అమ్మ తనమా లేదా నువ్వు చూపించే అభిమానమా?? ప్రేమతో నువ్వు కలిపే వరసలు కురిపిస్తాయి నాలో చిరు జల్లులు అమాయకపు నీ కళ్ళు,  ఆశగా నువ్వడిగే ప్రశ్నలు, ఆతృతగా నువ్వు విరిచే నటుకులు మొహమాటపు నవ్వులు...  తెలివితో కూడిన మాటలు ముద్దుగా చేసే చేష్టలు.. నువ్వు ఏమి చేసినా అపురూపమే.. అన్నీ నాకు మురిపేమే.. ఉంటా నీతో కలకాలమే.. 

అమ్మ కొరకు

అమ్మ వెలితి తీర్చలేము కానీ దేవుడిచ్చును అమ్మ రూపము.. భార్య కాదా అమ్మ , కడుపు నింపి నప్పుడు అత్త కాదా, ప్రేమార అత్తమ్మ అన్నప్పుడు. అక్క కాదా అమ్మ, మందలించినప్పుడు వదిన కాదా, మంచి మాట ఆడినప్పుడు.. చింతిoచకు నీవు అమ్మ కొరకు నీ గమ్యం చేరు వరకు నీ శక్తి మేరకు నీ అణువణువు ఆమె నీ చుట్టూరా ఆమె ప్రేమే..

The mysterious being

నీ కళ్ళు black hole నీ మనసు black box . ఎప్పుడూ నిజం పలికే పెదవులు ఆ మెదడు అర్ధం కాక మా తిప్పలు నీ ఆలోచనలు ఒక pandora's box చేస్తున్నాయి నన్ను curious Am I standing too near, and can't see the forest clear? వెళ్లాలా 2 steps back, చేయాలంటే నిన్ను crack ...

ప్రేమ పావురాలు - చిన్ని కవిత

తొలి చూపులో కలిగిన ఆనందం విడువకు కలకాలం  ఎన్నాళ్లయినా ఉండనీ ఆ చిలిపి తనం  జారిపోనీకు బాల్యం  అప్పుడు మీ ప్రేమను చూసి లోకం  అవ్వదా దాసోహం... 

ఋషి

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు... మరి వారు ఋషులంటే, మనలాంటి మాములు మనుషులకు కనిపిస్తారా? వినిపిస్తారా? మనుషులే ఋషులవుతుంటే, మరి ఈ కాలి యుగం లో వారు ఎలా ఉంటారు? మనలాగా జీన్స్ చొక్కా వేసుకుంటారా? లేదా సన్యాసం పుచ్చుకుని హిమాలయాలలో ఉంటారా? మనలానే ఆకలి నిద్ర కోరికలు ఉంటాయా? ఉద్యోగాలు చేస్తారా? లేదా?? ఇదిగో ఇదిగిదిగో ఇలానే, నేను పప్పులో కాలు వేసేసా ఇప్పటికే... ఋషి అనగానే, ఒక మనిషి, ఎలా ఉండాలో, ఏమి ధరించాలో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలో అని మన బుర్రలో మనమే ఒక లెక్క రాసేసుకుని, అలా ఎవరూ లేరనో, మనము ఉండలేమనో తీర్మానానికి వచ్చేసి, ఇంక చేసిది ఏమి లేక, చచ్చిపోని శవంలా, జీవం లేని బ్రతుకులు బ్రతికేస్తాం. ఎలాంటి ముందొస్తు ఆలోచనలు (అదే pre conceived notions ) లేకుండా, కలిసే ప్రతి వ్యక్తిని, ఎదురు పడే ప్రతి అవకాశాన్ని, మానను ఉత్తేజ పరిచే ప్రతి సంఘటనని, మన మనసుతో చూడగలిగితే?? ఒంటి కాలు పై తపస్సు చేసిన వాడు ఋషి అయితే, ఒక కాలు పై కుటుంబం, ఒక కాలు పై సమాజాన్ని మోసేవాడు?? ఓం కారాని జపించినవాడు ఋషి అయితే, మనుషుల మధ్య మమకారాన్ని పంచే వాడు?? దేవుడి పై ద్రుష్టి నిమఘ్న...

ఇంటి ముచ్చట్లు

కాకి కోయిల రాగాలు మామిడి చెట్ల పూతలు గుడి నుండి ఎం ఎస్ పాటలు Exhaust లేని వంట గదులు లేవగానే కళ్ళాపి ముగ్గులు పసుపు కాళ్ళు, కుంకుమ మొహాలు తులసి మొక్క పూజలు పూజ గది లో దీపాలు కచ్చ పోసిన చీర కట్లు మెతుకు కింద పడితే కోపంతో చూపులు ఆవుకు అక్షితల మొక్కులు మనమే బలెక్కి కట్టే పూలు పాడు పనులకు చెల్లి పెట్టే కేకలు WhatsApp  లో  చకా ఛకా మిత్రులకు పోతున్న updatlu వీధిలోని ఆత్మీయుల పలకరింపులు కొంగు ఎగ్గొట్టి పరుగు పరుగున పెళ్లి పనులు ఇవీ మా ఇంటి ముచ్చట్లు. 

ఈ విరహానికి అర్ధం ఉంది!!

అలసి ఇంటికి వచ్చి కలిసి వండుకున్నాం ... పెద్దవాళ్ళం అనుకున్నా, కాదు, కలిసి పెరిగాం ..  గమ్యం లేని ప్రయాణాలు, కలిసి పాడుకున్నాం ...  భవిష్యత్తు మీద ఆశ , కలిసి చదువుకున్నాం..  సమాజం చేసిన ఎగతాళికి కలిసి నవ్వుకున్నాం ...  లోకం వేసిన అడ్డుగోడల్ని కలిసి దాటాం...  సొంత వాళ్ళు పెట్టిన ఆంక్షలకు కలిసి పోరాడాం ...  నిస్సహాయపు రోజుల్లో కలిసి ఏడ్చామ్..  విహార యాత్ర లో కలిసి ఈదాం ...  అర్ధనారీశ్వరులు అని ఎందరో కొనియాడినా ...  భారతీయుడు couple అని ముద్దుగా పిలిచినా  ...  ఈ విరహాన్ని మాత్రం తప్పించుకోలేకపోయాం..  నీ భుజం పై తల పెట్టుకుని పడుకునే రోజు  నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే రోజు..  నీ చేతిలో  చేయి వేసి మాట్లాడే రోజు ..  రేపేనేమో అని ఆశతో ఎదురుచూస్తున్నా ...  ఇది దేవుడు ఆడుతున్న ఆటలో భాగమా?? లేదా కర్మానుసారం చేసుకున్నదా ?? లేదా విధి ఎప్పుడో నిర్ణయించిన మార్గమా?? ఏదేమైనా .. ఈ విరహాన్ని అర్ధం ఉంది.. విలువ ఉంది. .. 

ఎవరు గొప్ప?

జీవితం చూపించిన కష్టాలను దాటిన నువ్వు గొప్ప, కానీ ఆ కష్టాలలో నీ వెన్నంటి ఉన్న ఆమె?? కన్నీరు అనే సాగరాన్ని ఈదిన నువ్వు గొప్ప, కానీ ఆ కన్నీటిని తుడిచిన ఆమె?? ఒంటిరిగా బాధల్ని ఎదుర్కున్న నువ్వు గొప్ప, కానీ ఒంటరి తనంలో నీడలా నిల్చున్న ఆమె?? లోకమంతా చిన్న చూపు చూసినా, ఎత్తుకెదిగిన నువ్వు గొప్ప, కానీ నువ్వే నా రారాజు అన్న ఆమె?? గొప్పే కదా... 

I take a bow

To all the ordinarily looking extra ordinary people. They have doubts, but never back off to take risks. They ask questions, but not shy away from chasing answers. They take very small steps, but never miss to reach their dream. They do seemingly insignificant work, but don't forget to be happy about the journey. They exhibit humility, but there is a volcano bursting inside. To all the greatness in each of you.. To all the steadiness in each of you... To all the hardships and all the soreness... I take a bow. 

నవ్వే ఆయుధం.. నవ్వే సమాధానం.

మిత్రులతో హాస్యమాడినప్పుడు ముచ్చటైన గట్టి నవ్వు ప్రియురాలిని చూసినప్పుడు మధురమైన నవ్వు దేవుడి ధ్యానం లో ప్రశాంతమైన నవ్వు కవ్వించేటప్పుడు కొంటె నవ్వు జీవింతం విసిరిన కష్టమైన ప్రశ్నలకు గంభీరమైన నవ్వు విసుగెత్తిన వాదనలో నిట్టూర్పు నవ్వు గెలవలేని పోటీలు ఎదురైనప్పుడు నిస్సహాయపు నవ్వు నవ్వునే ఆభరణంగా ధరించిన శివుడివా? లేదా నవ్వునే జపంగా ఎంచుకున్న ఋషివా? నవ్వే నీ ఆయుధమా? నవ్వే నీ సమాధానమా ??

నిలువెత్తు రూపం

అమాయకంగా కనిపించే నీ కళ్ళు, భవిష్యత్తు పై నీకున్న ఆశకి సంకేతం.  ఆత్మావిశ్వాసంతో కూడిన నీ చిరునవ్వు, నీ పట్టుదల పై నీకున్న నమ్మకానికి సంతకం .  నిటారుగా ఉన్న నీ వెన్నుముక, వెయ్యి ఏనుగులను సాధిచగలననే ధైర్యానికి నిదర్శనం.  చేతులు కట్టుకుని నిలబడ్డ నువ్వు, స్ఫూర్తి దాయక జీవితానికి ఒక నిలువెత్తు రూపం . 

నేనెంత

నీవు పడిన కష్టాల ముందు నేనెంత, నీవు ఎదుర్కున్న ఒడిదుడుకుల ముందు నేనెంత, చెరువు లో వాన పామంత... నువ్వు ఈదిన సాగరాల ముందు నేనెంత, నువ్వు మోసిన బరువు ముందు నేనెంత, సముద్రం పై ఎగిరే పిచుకంత... నీ నిద్ర లేని రాత్రుల ముందు నేనెంత, నీ అలసి సొలసిన పగళ్ళ ముందు నేనెంత, సూర్యుడి కింద వెలిగే మిణుగురు పురుగంత... కన్నీళ్ళతో గొంతు తడుపుకున్న నీ శ్రమ ముందు నేనెంత, చిరునవ్వుతో కడుపు నింపుకున్న నీ ఆకలి ముందు నేనెంత, బియ్యంలో ఆవ గింజంత... గుండె నిండా ఉన్న నీ ధైర్యం ముందు నేనెంత, మనసు నిండా ఉన్న నీ ప్రేమ ముందు నేనెంత, గాలి వానలో ఎగిరిపోయే జాజి పూవంత... సమాజంతో పోరాడిన నీ పట్టుదల ముందు నేనెంత, శిఖరాలను చేర్చగలిగే నీ జ్ఞానం ముందు నేనెంత, కొండ అంచుల్లో పెరిగే గడ్డి పోచంత... నీ వయసుకి మించిన అనుభవాల ముందు నేనెంత, ప్రేరేపితమైన నీ జీవితం ముందు నేనెంత, హనుమంతుడి ముందు కుప్పి గెంతంత...

Sneham

వ్యవహారిక బంధాలు, తామరాకుపై నీటి బిందువులు .  కుటుంబ సంబంధాలు, జాజి పందిరి.  తోబుట్టువులతో అయితే గులాబీ, దానితో పాటు వచ్చే ముళ్ళు.  ప్రేమికుడి బంధం, జాజి వెదచల్లే సువాసన...  మన జీవితం లో ఒక్కో దశ లో ఒక్కో రకమైన అనుభూతిని పొందుతూ ఉంటాం. అందులో ఒకటి స్నేహం. ఒక స్నేహితుడితో బంధం చల్లగా  వీచే గాలి.  పలకా బలపం వయసులో చాకోలెట్లు పంచుకోవడం స్నేహం అయితే, పరుగు పందెం లో ఓడి నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించడమూ స్నేహమే..  తప్పు దోవ పడుతుంటే ఆపేవాడు, తప్పటడులు వేయకుండా చూసేవాడు, నిత్యం వెన్నంటి కాపు కాసేవాడు ...  కలిసి మెలిసి ఆశయ సాధనకై, పట్టు వదలని సైనికులిలా నడిచేవారు...  అలాంటి స్నేహితులు ఎదురు పడినప్పుడు, మనసు వారిలో కలవాలని, వారితో చేరాలని కుతూహల పడినా,  పగలంతా అల్లరి చేసి ప్రశాంతం గా పడుకున్న పసి బాబు ను చూసి పులకిరించే తల్లి లా,  వారిని అలానే దూరమునుండి చూడడమూ స్నేహమే..