వ్యవహారిక బంధాలు, తామరాకుపై నీటి బిందువులు .
కుటుంబ సంబంధాలు, జాజి పందిరి.
తోబుట్టువులతో అయితే గులాబీ, దానితో పాటు వచ్చే ముళ్ళు.
ప్రేమికుడి బంధం, జాజి వెదచల్లే సువాసన...
మన జీవితం లో ఒక్కో దశ లో ఒక్కో రకమైన అనుభూతిని పొందుతూ ఉంటాం.
అందులో ఒకటి స్నేహం. ఒక స్నేహితుడితో బంధం చల్లగా వీచే గాలి.
పలకా బలపం వయసులో చాకోలెట్లు పంచుకోవడం స్నేహం అయితే, పరుగు పందెం లో ఓడి నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించడమూ స్నేహమే..
తప్పు దోవ పడుతుంటే ఆపేవాడు, తప్పటడులు వేయకుండా చూసేవాడు, నిత్యం వెన్నంటి కాపు కాసేవాడు ... కలిసి మెలిసి ఆశయ సాధనకై, పట్టు వదలని సైనికులిలా నడిచేవారు...
అలాంటి స్నేహితులు ఎదురు పడినప్పుడు, మనసు వారిలో కలవాలని, వారితో చేరాలని కుతూహల పడినా,
పగలంతా అల్లరి చేసి ప్రశాంతం గా పడుకున్న పసి బాబు ను చూసి పులకిరించే తల్లి లా,
వారిని అలానే దూరమునుండి చూడడమూ స్నేహమే..
No comments:
Post a Comment