Tuesday, October 21, 2025

Ego vs Self Respect

 They say that there's a very thin line between ego and self respect. 

I'm not mature enough to 

1. Understand that line

2. How to draw that line

3. How to understand if someone's crossing that line

4. How to react if I get to know someone's crossing the line

5. Am I crossing that line while conversing with someone. 

Keeping all this jargon aside, all I crave for and long for and live for is LOVE. 

Some say that I am losing my self respect in the process of accepting someone's love, but what's the big deal about it?

When my heart is being filled with love, can't I be a little flexible in accepting someone's ego?

Loving myself

 How do I love you more by ten times, 

When my head is already over my heels


While kind and gentle are your traits, 

You got all correct with your tactics. 


Can you see me in all smiles, 

When I see you and my heart bounce. 


With all the care, you listen to my words,

I am here, for you, with all my ears. 


The attention you give, with your cute little eyes, 

I can never ignore, any which ways. 


I think about you a hundred times, 

And smile at my own stars.. 


What can I do with your innocence, 

Except to love you leaps and bounds. 


The pegs, rides, songs, tears and kisses, 

made a life time memories and are ever lasting moments.. 


You accepted me for who I am

never questioned where I came from

Why did you make me your bangaram, when my life is in middle of a jam.. 


Your love is very special, since you made me fall in love with myself.

Namaskaram Mitramaaa

అది సముద్ర తీరము. సాయంత్రం 5 కావొస్తోంది.. 

ఆ సముద్రం అంటే నాకు చాలా ఇష్టం.. 

చల్లని గాలి, ఆ అలల శబ్దం, వొడ్డున కూర్చుని ఎంత సేపైనా ఉండొచ్చు.

ఆ  సాయంత్రం 

సముద్రం అంత ప్రేమను చూపింది.

లోతైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. 

వచ్చి పోయే ఆలోచనలను  ఉత్తేజపరిచాయి


ఆ వచ్చి పోయే అలలు. మధ్యలో తకి తాకనట్టు వచ్చే చల్లటి గాలి, నా మనసు లోతుల్లో చెప్పలేని ఎవరికి అర్థం కాని అర్ధం కాని బాధని మాయం చేస్తుంది అనిపిస్తుంది. 

ఇన్నాళ్లు అది ప్రకృతి కు ఉన్న శక్తీ అనుకున్నా... కానీ, అదే ప్రేమ, అదే సమాధానం, అదే ఉత్తేజం మంచి మిత్రులతో గడిపిన క్షణాలు కూడా తెస్తాయి... 

ఆ మిత్రులకి ఏదైనా చెయ్యాలి, ఏదో చెప్పాలి, నా కృతజ్ఞత చెప్పాలి అనిపించింది.. కానీ ఏమీ చేయలేక, వారిని పుట్టించిన ఆ భగవంతునికి, ఆ కన్న తల్లి కి మనస్పూర్తి గా నమస్కారం చేశా.. 

Die or live

You are my secret truth, which is the sweetest lie..


You are my darkest reality, existing in the brightest of the suns..


You are my emotion, which I wish to carry to my grave...


You are my smile, which shows that life is worth loving.. 


You are my tears, questioning my very existence ..


You are my reason, to survive and swim through hard times..


You are my hope, to live one day more, a little more..

Nireekshana

 ప్రపంచం ఒక రీతి లో నడుస్తూ సాగుతోంది.. ఒక తీరున ఆలోచిస్తే, ఒక రోజు సగటున ఏమీ మారలేదు..


అదే సూర్యుడు.. అదే చంద్రుడు.. అవే పక్షులు.. అవి పెట్టే కూతలు.. విరబూసిన పూలు.. ఏవి మారలేదు..


కానీ 


నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, 

నీ మాట కోసం పరితపిస్తూ ఉంటే, 

నీ గొంతు వినాలని, 

నిన్ను ఒక్క క్షణం చూడాలని అనిపించినప్పుడు,


ఈ ప్రపంచం శూన్యం లాగా,

ఒక క్షణం యుగం లాగా మారిపోతుంది.. 

ఆ సూర్య చంద్రులు విలవిల పోతాయి.

ఆ పక్షుల కూతలు విసిగిస్తాయి..

ఆ పూలు మొక్కలు కూడా జాలిగా విలపిస్తాయి..

Baaundhi

 ఏం చేసి నీ పై ప్రేమ తెలపను?

ఎలా నీ ప్రేమను పొందను??


నువ్వు నవ్వితే బావుంటుంది, కాని ఆ నవ్వుకు కారణం నేనైతే ఇంకా చాలా బావుంటుంది....


నీ సిగ్గు బావుంటుంది, కాని అప్పుడు ఆ బుగ్గ పై చిన్న సొట్ట పడితే ఇంకా చాలా బావుంటుంది...


నీ చూపు బావుంటుంది, కాని ఆ కళ్లు చిట్లించి కొంటెగా చూస్తే ఇంకా చాలా బావుంటుంది...


నీతో మాట్లాడినప్పుడు బావుంటుంది, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడితే ఇంకా చాలా బావుంటుంది...


నీతో ఉన్నప్పుడు బావుంటుంది, కానీ మొత్తం నీతోనే ఉంటే ఇంకా చాలా బావుంటుంది...

chethi raatha

 నీతో కలిసి నవ్వుకోవలని ఉంది కానీ కబుర్లే తక్కువాయే...


నీ చేయి పట్టుకుని నడవాలని ఉంది కానీ లోకుల కళ్ళకు భయమాయే...


నీ వడిలో పడుకోవాలని ఉంది కానీ దూరం చాలా ఎక్కువాయే...


చిలిపి పనులకు అలగాలని ఉంది కానీ విరహం భరించలేకపోయే...


చాలా కోప్పడాలని ఉంది కాని మీ పై గౌరవం నన్ను ఆపసాగే...


నిన్ను పట్టుకుని గట్టిగా ఏడ్వాలని ఉంది, కానీ నా పిరికితనం అడ్డమాయే...


నీ పై ప్రేమను చెప్పాలని ఉంది కానీ మాటలే కరువాయే.. 


ఈ జన్మకి నిన్ను చేరాలని ఉంది, కానీ ఆ విధే నాకు శత్రువాయే...


నీతో వేరే ప్రపంచానికి ఎగిరి పోవాలని ఉంది కానీ బాధ్యతలు వెనక్కి లాగే...


నీకో పాపని ఇవ్వాలని ఉంది కానీ నా చేతి లో ఆ గీత లేదాయే...


Dooram daggara chese

 నీ కోసమే ఎదురు చూస్తున్నా

నీ మాటకై పరి తపిస్తున్నా

నీ చూపుల్లో పులకరిస్తున్నా 

నీ జ్ఞాపకాల్లో పరవసిస్తున్నా

నీ తలపులలో జీవిస్తున్నా


నీకై వేచి చూసే ప్రతీ క్షణం

నీ ఆలోచనలో గడిపే ప్రతీ రోజు

ఈ విరహంతో నిండిన ఈ యాత్ర

అన్నీ నాకు నీకు ఉన్న దూరాన్ని మరింత దగ్గర చేస్తున్నాయి..

Edhuru chupulu

 రోజులో మొదటి ఆలోచన, ఆఖరి ఆలోచన ఎవరి కోసం చేస్తున్నామో వారి పై చాలా ప్రేమ ఉనట్టు అంటారు.. 

మరి రోజులో ప్రతీ క్షణం వారి గురించే ఆలోచిస్తూ ఉంటే??


నిన్ను ఒక్క సారి చూడాలని.

నీతో ఒక్క సారి మాట్లాడాలని.

ఆ గొంతు ఒక్క సారి వినాలని.

నా గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుసా.. 


ఆ భుజం పై ఒక్క సారి తల వాల్చాలని.

నీ వేళ్ళని ఒక్క సారి నిమరాలని.

పెదవుల పై ఒక్క ముద్దు పెట్టాలని..

నా మనసు ఎంత తహతహలాడుతుందో తెలుసా?


నిన్ను చూసే ఒక్క క్షణం కోసం, నీతో గడిపే ఒక్క క్షణం కోసం.. 

ఎన్ని గంటలు ఎదురు చూసిన

ఆ అనుభూతి తియ్యగానే ఉంటుంది..

Prema Lekha

 రెక్కల గుర్రం ఎక్కి రాలేదు 

మేడలు మిద్దెలు చూపలేదు

గొప్పలు పోయే ఆడంబరాలు లేవు 

ఆస్తులు కాదు అంతస్తులు కాదు

మనిషిని చూస్తే గంభీరం కడు

కోపానికి భద్ధలయ్యే కొండలు

కానీ జాలి ప్రేమే నీ గుణాలు

మనసేమో చిన్నపిల్లల తీరు 

గుండెలో మెదిలే చాలా ఆలోచనలు

పెదవులపై చెదరని చిరునవ్వులు 

నీ వేళ్ళు తుడిచాయి నా కంట నీరు

ప్రేమని చూపే మీ చిన్ని చిన్ని కళ్లు

మన స్నేహానికి పునాది ఆ షికారు

ముద్దుగా బంగారం అనే పేరు

నేను తిరిగి ఇవ్వలేని దీనురాలు

రోజూ ఒక్క పది మంచి మాటలు

గెలుపుకు ఇవేగా మీ ఆయుధాలు

Ego vs Self Respect

 They say that there's a very thin line between ego and self respect.  I'm not mature enough to  1. Understand that line 2. How to d...