రోజులో మొదటి ఆలోచన, ఆఖరి ఆలోచన ఎవరి కోసం చేస్తున్నామో వారి పై చాలా ప్రేమ ఉనట్టు అంటారు..
మరి రోజులో ప్రతీ క్షణం వారి గురించే ఆలోచిస్తూ ఉంటే??
నిన్ను ఒక్క సారి చూడాలని.
నీతో ఒక్క సారి మాట్లాడాలని.
ఆ గొంతు ఒక్క సారి వినాలని.
నా గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుసా..
ఆ భుజం పై ఒక్క సారి తల వాల్చాలని.
నీ వేళ్ళని ఒక్క సారి నిమరాలని.
పెదవుల పై ఒక్క ముద్దు పెట్టాలని..
నా మనసు ఎంత తహతహలాడుతుందో తెలుసా?
నిన్ను చూసే ఒక్క క్షణం కోసం, నీతో గడిపే ఒక్క క్షణం కోసం..
ఎన్ని గంటలు ఎదురు చూసిన
ఆ అనుభూతి తియ్యగానే ఉంటుంది..
No comments:
Post a Comment