నీతో కలిసి నవ్వుకోవలని ఉంది కానీ కబుర్లే తక్కువాయే...
నీ చేయి పట్టుకుని నడవాలని ఉంది కానీ లోకుల కళ్ళకు భయమాయే...
నీ వడిలో పడుకోవాలని ఉంది కానీ దూరం చాలా ఎక్కువాయే...
చిలిపి పనులకు అలగాలని ఉంది కానీ విరహం భరించలేకపోయే...
చాలా కోప్పడాలని ఉంది కాని మీ పై గౌరవం నన్ను ఆపసాగే...
నిన్ను పట్టుకుని గట్టిగా ఏడ్వాలని ఉంది, కానీ నా పిరికితనం అడ్డమాయే...
నీ పై ప్రేమను చెప్పాలని ఉంది కానీ మాటలే కరువాయే..
ఈ జన్మకి నిన్ను చేరాలని ఉంది, కానీ ఆ విధే నాకు శత్రువాయే...
నీతో వేరే ప్రపంచానికి ఎగిరి పోవాలని ఉంది కానీ బాధ్యతలు వెనక్కి లాగే...
నీకో పాపని ఇవ్వాలని ఉంది కానీ నా చేతి లో ఆ గీత లేదాయే...
No comments:
Post a Comment