రెక్కల గుర్రం ఎక్కి రాలేదు
మేడలు మిద్దెలు చూపలేదు
గొప్పలు పోయే ఆడంబరాలు లేవు
ఆస్తులు కాదు అంతస్తులు కాదు
మనిషిని చూస్తే గంభీరం కడు
కోపానికి భద్ధలయ్యే కొండలు
కానీ జాలి ప్రేమే నీ గుణాలు
మనసేమో చిన్నపిల్లల తీరు
గుండెలో మెదిలే చాలా ఆలోచనలు
పెదవులపై చెదరని చిరునవ్వులు
నీ వేళ్ళు తుడిచాయి నా కంట నీరు
ప్రేమని చూపే మీ చిన్ని చిన్ని కళ్లు
మన స్నేహానికి పునాది ఆ షికారు
ముద్దుగా బంగారం అనే పేరు
నేను తిరిగి ఇవ్వలేని దీనురాలు
రోజూ ఒక్క పది మంచి మాటలు
గెలుపుకు ఇవేగా మీ ఆయుధాలు
No comments:
Post a Comment