ప్రపంచం ఒక రీతి లో నడుస్తూ సాగుతోంది.. ఒక తీరున ఆలోచిస్తే, ఒక రోజు సగటున ఏమీ మారలేదు..
అదే సూర్యుడు.. అదే చంద్రుడు.. అవే పక్షులు.. అవి పెట్టే కూతలు.. విరబూసిన పూలు.. ఏవి మారలేదు..
కానీ
నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే,
నీ మాట కోసం పరితపిస్తూ ఉంటే,
నీ గొంతు వినాలని,
నిన్ను ఒక్క క్షణం చూడాలని అనిపించినప్పుడు,
ఈ ప్రపంచం శూన్యం లాగా,
ఒక క్షణం యుగం లాగా మారిపోతుంది..
ఆ సూర్య చంద్రులు విలవిల పోతాయి.
ఆ పక్షుల కూతలు విసిగిస్తాయి..
ఆ పూలు మొక్కలు కూడా జాలిగా విలపిస్తాయి..
No comments:
Post a Comment