Skip to main content

Posts

Nireekshana

 ప్రపంచం ఒక రీతి లో నడుస్తూ సాగుతోంది.. ఒక తీరున ఆలోచిస్తే, ఒక రోజు సగటున ఏమీ మారలేదు.. అదే సూర్యుడు.. అదే చంద్రుడు.. అవే పక్షులు.. అవి పెట్టే కూతలు.. విరబూసిన పూలు.. ఏవి మారలేదు.. కానీ  నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే,  నీ మాట కోసం పరితపిస్తూ ఉంటే,  నీ గొంతు వినాలని,  నిన్ను ఒక్క క్షణం చూడాలని అనిపించినప్పుడు, ఈ ప్రపంచం శూన్యం లాగా, ఒక క్షణం యుగం లాగా మారిపోతుంది..  ఆ సూర్య చంద్రులు విలవిల పోతాయి. ఆ పక్షుల కూతలు విసిగిస్తాయి.. ఆ పూలు మొక్కలు కూడా జాలిగా విలపిస్తాయి..

Baaundhi

 ఏం చేసి నీ పై ప్రేమ తెలపను? ఎలా నీ ప్రేమను పొందను?? నువ్వు నవ్వితే బావుంటుంది, కాని ఆ నవ్వుకు కారణం నేనైతే ఇంకా చాలా బావుంటుంది.... నీ సిగ్గు బావుంటుంది, కాని అప్పుడు ఆ బుగ్గ పై చిన్న సొట్ట పడితే ఇంకా చాలా బావుంటుంది... నీ చూపు బావుంటుంది, కాని ఆ కళ్లు చిట్లించి కొంటెగా చూస్తే ఇంకా చాలా బావుంటుంది... నీతో మాట్లాడినప్పుడు బావుంటుంది, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడితే ఇంకా చాలా బావుంటుంది... నీతో ఉన్నప్పుడు బావుంటుంది, కానీ మొత్తం నీతోనే ఉంటే ఇంకా చాలా బావుంటుంది...

chethi raatha

 నీతో కలిసి నవ్వుకోవలని ఉంది కానీ కబుర్లే తక్కువాయే... నీ చేయి పట్టుకుని నడవాలని ఉంది కానీ లోకుల కళ్ళకు భయమాయే... నీ వడిలో పడుకోవాలని ఉంది కానీ దూరం చాలా ఎక్కువాయే... చిలిపి పనులకు అలగాలని ఉంది కానీ విరహం భరించలేకపోయే... చాలా కోప్పడాలని ఉంది కాని మీ పై గౌరవం నన్ను ఆపసాగే... నిన్ను పట్టుకుని గట్టిగా ఏడ్వాలని ఉంది, కానీ నా పిరికితనం అడ్డమాయే... నీ పై ప్రేమను చెప్పాలని ఉంది కానీ మాటలే కరువాయే..  ఈ జన్మకి నిన్ను చేరాలని ఉంది, కానీ ఆ విధే నాకు శత్రువాయే... నీతో వేరే ప్రపంచానికి ఎగిరి పోవాలని ఉంది కానీ బాధ్యతలు వెనక్కి లాగే... నీకో పాపని ఇవ్వాలని ఉంది కానీ నా చేతి లో ఆ గీత లేదాయే...

Dooram daggara chese

 నీ కోసమే ఎదురు చూస్తున్నా నీ మాటకై పరి తపిస్తున్నా నీ చూపుల్లో పులకరిస్తున్నా  నీ జ్ఞాపకాల్లో పరవసిస్తున్నా నీ తలపులలో జీవిస్తున్నా నీకై వేచి చూసే ప్రతీ క్షణం నీ ఆలోచనలో గడిపే ప్రతీ రోజు ఈ విరహంతో నిండిన ఈ యాత్ర అన్నీ నాకు నీకు ఉన్న దూరాన్ని మరింత దగ్గర చేస్తున్నాయి..

Edhuru chupulu

 రోజులో మొదటి ఆలోచన, ఆఖరి ఆలోచన ఎవరి కోసం చేస్తున్నామో వారి పై చాలా ప్రేమ ఉనట్టు అంటారు..  మరి రోజులో ప్రతీ క్షణం వారి గురించే ఆలోచిస్తూ ఉంటే?? నిన్ను ఒక్క సారి చూడాలని. నీతో ఒక్క సారి మాట్లాడాలని. ఆ గొంతు ఒక్క సారి వినాలని. నా గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుసా..  ఆ భుజం పై ఒక్క సారి తల వాల్చాలని. నీ వేళ్ళని ఒక్క సారి నిమరాలని. పెదవుల పై ఒక్క ముద్దు పెట్టాలని.. నా మనసు ఎంత తహతహలాడుతుందో తెలుసా? నిన్ను చూసే ఒక్క క్షణం కోసం, నీతో గడిపే ఒక్క క్షణం కోసం..  ఎన్ని గంటలు ఎదురు చూసిన ఆ అనుభూతి తియ్యగానే ఉంటుంది..

Prema Lekha

 రెక్కల గుర్రం ఎక్కి రాలేదు  మేడలు మిద్దెలు చూపలేదు గొప్పలు పోయే ఆడంబరాలు లేవు  ఆస్తులు కాదు అంతస్తులు కాదు మనిషిని చూస్తే గంభీరం కడు కోపానికి భద్ధలయ్యే కొండలు కానీ జాలి ప్రేమే నీ గుణాలు మనసేమో చిన్నపిల్లల తీరు  గుండెలో మెదిలే చాలా ఆలోచనలు పెదవులపై చెదరని చిరునవ్వులు  నీ వేళ్ళు తుడిచాయి నా కంట నీరు ప్రేమని చూపే మీ చిన్ని చిన్ని కళ్లు మన స్నేహానికి పునాది ఆ షికారు ముద్దుగా బంగారం అనే పేరు నేను తిరిగి ఇవ్వలేని దీనురాలు రోజూ ఒక్క పది మంచి మాటలు గెలుపుకు ఇవేగా మీ ఆయుధాలు

karu mabbulu

ఊరు మొత్తం కారు మబ్బులు కప్పేసాయి, నా మనసును మీ ఆలోచనలు కప్పేసినట్టు..........